వడ్డీ రేట్లు: మరో అరశాతం పెంపు?
జూన్ లేదా జులై నెలలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశముంది. కనీసం అర శాతం మేర వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని మే 2,4 తేదీల్లో జరిగిన ఫెడ్ సమావేశం మినిట్స్ చెబుతున్నాయి. ద్రవ్యోల్బణ రేటు అధికంగా ఉంటుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్న నేపథ్యంలో భారీ వడ్డీ రేట్ల పెంపు ఖాయంగా కన్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితిని కొనసాగించే కన్నా… సాధ్యమైనంత త్వరగా వడ్డీ రేట్లను పెంచడమే బెటర్ అని కొంత మంది ఆర్థిక వేత్తలు అంటున్నారు. కార్మికుల కొరత తీవ్రంగా ఉందని, అలాగే ఆహార వస్తువుల సరఫరా తగ్గుతోందని.. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణ వెంటనే తగ్గకపోవచ్చని వీరు భావిస్తున్నారు. మినిట్స్ వివరాలు వెల్లడైన తరవాత అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. మార్కెట్ అర శాతం వడ్డీని డిస్కౌంట్ చేసిందని కొందరు స్టాక్ మార్కెట్ అనలిస్టులు అంటున్నారు. ఫెడ్రల్ రిజర్వ్ జులైలో వడ్డీ రేట్లను పెంచవచ్చని మరికొందరు అంటున్నారు.