For Money

Business News

నిఫ్టికి దూరంగా ఉండండి.. సుఖాని

మార్కెట్‌ పెరిగేందుకు ఎలాంటి కారణం లేదని… ఇన్వెస్టర్లు నిఫ్టికి దూరంగా ఉండటం మంచిదని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని అంటున్నారు. ఇవాళ ఆయన సీఎన్‌బీసీ టీవీ18తో మాట్లాడుతూ… నిఫ్టి కన్నా… నిఫ్టి బ్యాంక్‌ కాస్త బలంగా ఉందని అన్నారు. నిఫ్టి చాలా బలహీనంగా ఉన్నందున.. సూచీల బదులు షేర్లను చూడమని ఆయన సలహా ఇస్తున్నారు. ఇవాళ్టి ట్రేడింగ్‌కు ఆయన హెచ్‌ఏఎల్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లను సిఫారసు చేశారు. పేజ్‌ ఇండస్ట్రీస్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోందని.. భారీగా క్షీణించిన తరవాత కూడా ఈ షేర్‌ బలహీనంగా ఉందని అన్నారు. ఈ కౌంటర్‌లో ఏదో జరుగుతోందని … ఈ షేర్‌ను అమ్మడమే బెటర్‌ అని ఆయన సలహా ఇస్తున్నారు.