మరో 0.75 శాతం పెంపు
మార్కెట్ భయపడినట్లే అమెరికా కేంద్ర బ్యాంక్ రాత్రి వడ్డీ రేట్లను 0.75 శాతం చొప్పున పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేటు శ్రేణి 3.75 నుంచి 4 శాతానికి చేరింది.2008 తరవాత ఫెడ్ రేట్లు ఈ స్థాయికి రావడం ఇదే మొదటిసారి. జూన్ నుంచి ఇప్పటివరకూ నాలుగు దఫాలు 0.75 శాతం చొప్పున రేట్లను పెంచింది. వచ్చే డిసెంబర్ సమీక్షలో మరో 0.50 శాతం, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి సమీక్షల్లో 0.25 శాతం చొప్పున పెంచే అవకాశముంది. వచ్చే మార్చికల్లా ఫెడ్ ఫండ్స్ రేటు 5 శాతానికి చేరే అవకాశం ఉంది. ఇపుడు నాన్ ఫామ్ పేరోల్స్ డేటా కోసం మార్కెట్ ఎదురు చూస్తోంది.