For Money

Business News

ఫ్యాబ్‌ ఇండియా భారీ IPO

ఫ్యాబ్‌ ఇండియా వచ్చే ఏడాది పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు రెడీ అవుతోంది. మార్కెట్‌ నుంచి సుమారు రూ.3,750 కోట్లు (50 కోట్ల డాలర్లు) సమీకరించాలని భావిస్తోంది. ఈ మేరకు దరఖాస్తు పత్రాలను సెబీకి సమర్పించనుంది. కంపెనీలో ఇపుడున్న ఇన్వెస్టర్లు తమ షేర్లను విక్రయించేందుకు సిద్ధమయ్యారని, దీంతో తాజా షేర్ల కంటే ఉన్న షేర్లను అమ్మడానికి పబ్లిక్‌ ఆఫర్‌ చేస్తున్నట్లు సమాచారం. తమ కంపెనీ మార్కెట్‌ విలువను 200 కోట్ల డాలర్ల (సుమారు రూ.15,000 కోట్లు)ని ఫ్యాబ్‌ ఇండియా అంటోంది. ఈ సంస్థలో విప్రో వ్యవస్థాపకులు అజీమ్‌ ప్రేమ్‌జీకి చెందిన ప్రేమ్‌జీఇన్వెస్ట్‌ పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఈయన కూడా తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించే అవకాశముంది.