డీజిల్ ఎగుమతిపై సుంకం తగ్గింపు
క్రూడ్, డీజిల్, ఏటీఎఫ్‌లపై ఆయాచిత ఆదాయ పన్ను (Windfall Gains Tax)లను కేంద్ర సవరించింది. డీజిల్ ఎగుమతిపై ఇపుడు లీటర్‌కు రూ.11 ఎగుమతి సుంకం విధిస్తుండగా.. దీన్ని రూ. 5లకు తగ్గించింది. పెట్రోల్‌పై ఎగుమతి సుంకాన్ని ఇప్పటికే ఎత్తివేసిన విషయం తెలిసిందే. క్రూడ్ ఆయిల్ ఎగుమతిపై సెస్‌ను టన్నుకు రూ. 17000 విధిస్తుండగా, దీన్ని రూ. 17750కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇక విమానాల్లో వాడే పెట్రోల్ (ఏటీఎఫ్ – Aviation Turbine Fuel)పై సుంకం రూ.4 ఉండగా.. దీన్ని పూర్తిగా ఎత్తివేసింది. రిలయన్స్, ఓఎన్జీసీతో పాటు ఇతర కంపెనీలకు దీని వల్ల భారీగా ప్రయోజనం చేకూరనుంది. పెట్రోల్, డీజిల్‌పై భారీగా వేసిన సుంకాలను తగ్గించడంత ఈ కంపెనీలు భారీ ఊరట లభించింది. మార్కెట్లో ఇవాళ ఈ షేర్లకు మంచి మద్దతు లభించవచ్చ.