యూరో నష్టాలతో నిఫ్టి ఢమాల్
మిడ్‌సెషన్ సమయానికి అంటే యూరో మార్కెట్లు ప్రారంభమయ్యే సరికల్లా నిఫ్టి దాదాపు క్రితం ముగింపు స్థాయికి వచ్చేసింది. ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన నిఫ్టి క్రమంగా బలహీనపడుతూ 11 గంటలకల్లా 16,133 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. అక్కడి నుంచి 320 పాయింట్లు కోలుకుంది నిఫ్టి. ఇక గ్రీన్‌లోకి వచ్చే సమయంలో యూరో మార్కెట్లు దారుణంగా దెబ్బతీశాయి. సాధారణంగా గరిష్ఠంగా రెండు శాతం నష్టపోయే యూరో మార్కెట్లు ఇవాళ ఏకంగా మూడు శాతంపైగా నష్టపోయాయి. డాక్స్, ఫుట్సి వంటి ప్రధాన ఎక్స్ఛేంజీలు మూడు శాతంపైగా నష్టపోయాయి. యూరో స్టాక్స్ 50 సూచీ 3.25 శాతం నష్టంతో ట్రేడవుతోంది. దీంతో నిఫ్టిలో మళ్ళీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. చివరికి 252 పాయింట్ల నష్టంతో 16,245 పాయింట్ల వద్ద ముగిసింది (తాత్కాలిక ముగింపు). కనిష్ఠ స్థాయి నుంచి వంద పాయింట్లు పైన క్లోజైందన్నమాట. నిఫ్టిలో 40 షేర్లు నష్టాలతోముగిశాయి. అన్ని సూచీలు 1.5 శాతంపైగా నష్టంతో ముగిశాయి. ఇటీవల ఎన్నడూ లేనివిధంగా …ఎపుడూ పటిష్ఠంగా ఉండే నిఫ్టి నెక్ట్స్ ఇవాళ 2.4 శాతం నష్టపోయింది. మార్కెట్ డార్లింగ్ షేర్లయిన జూబ్లియంట్ ఫుడ్స్, మెక్‌డొనాల్డ్స్, వేదాంత, నౌకరీ డాట్ వంటి షేర్లు ఇవాళ భారీగా నష్టపోయాయి.