దీపావళి ముందే పీఎఫ్‌పై వడ్డీ చెల్లింపు?
ఈపీఎఫ్ సబ్‌స్క్రయిబర్లకు 2020-21 ఏడాదికి 8.5 శాతం ఇవ్వడాలని గత మార్చి నెలలోనే నిర్ణయించినా ఇప్పటి వరకు వడ్డీ వారి ఖాతాల్లో వేయలేదు. దీనికి సంబంధించిన ఫైల్‌ను ఆర్థిక శాఖకు పంపామని, దీపావళి పండుగ లోపల వారి ఖాతాల్లో వడ్డీ జమ అవుతుందని ఈపీఎఫ్ అధికారులు అంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు పెంచిన డీఏ, డీఆర్‌లకు కూడా అమల్లోకి రావడంతో పండుగ సీజన్‌లో వ్యాపారలు కళకళలాడే అవకాశముంది. పలు ప్రభుత్వ స్కీములతో పోలిస్తే ఈపీఎఫ్‌పై ప్రభుత్వం అధిక వడ్డీ చెల్లించేందుకు నిర్ణయించింది. స్టాక్ మార్కెట్‌లో పెట్టిన పెట్టుబడులపై ఆకర్షణీయ లాభం రావడం కూడా ఒక కారణంగా అధికారులు అంటున్నారు.