రోజువారీ పద్ధతికి గుడ్‌బై?
ప్రస్తుతం అమలు చేస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజూ సవరించే పద్ధతికి స్వస్తి పలకాలని కేంద్ర భావిస్తోంది. గత ఏప్రిల్ నుంచి వీటి ధరల పెంపును ఆపేశారు. ఇటీవల క్రూడ్ ధరలు పెరుగుతూనే ఉన్నందున… పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తగ్గడం చాలా తక్కువ. అయితే మొత్తం ఈ రోజు వారీ పద్ధతినే ఎత్తివేసే అంశాన్ని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రతిపాదనపై ఇపుడు చర్చ జరుగుతోందని…ఈ నిర్ణయాన్ని రాజకీయ కోణంలో కూడా చూడాల్సి ఉన్నందున ప్రభుత్వం ఆచితూచి అడుగు వేస్తోందని ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుత పద్ధతి బదులు ప్రతివారం లేదా నెలకు ఒకసారి ధరలు ప్రకటించే పద్ధతిని యోచిస్తోంది. రెండు నెలలకు లేదా మూడు నెలలకు ఒకసారి సవరిస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. అలాగే పెట్రోల్, డీజిల్ ధరలో సముద్ర రవాణా ఖర్చు, షిప్ బీమా ఖర్చు వేస్తున్నారని.. దీని తొలగించే అంశంపైనా కేంద్రం ఆలోచిస్తోంది. ఇపుడు క్రూడ్ దిగుమతి చేసుకుని రీఫైన్ చేసి అమ్ముతున్నారు. క్రూడ్‌పై ఈ ఖర్చలు కలుపుతున్నందున… పెట్రోల్, డీజిల్ ధరలో మళ్ళీ ఈ ఖర్చులు కలపడం అక్కర్లేదని ప్రభుత్వం భావిస్తోంది.