ఇమామి చేతికి డర్మీ కూల్
రెకిట్ బెంకిసర్ హెల్త్‌కేర్ నుంచి డర్మీ కూల్ బ్రాండ్‌ను ఇమామి కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు డీల్ విలువ రూ. 432 కోట్లు. ఈ డీల్‌కు అవసరమైన మొత్తాన్ని తమ అంతర్గత వనరుల ద్వారా తాము సమకూర్చుకున్నట్లు ఇమామీ వెల్లడించింది. డర్మీ కూల్‌కు ఈ విభాగంలో 20 శాతం మార్కెట్ వాటా ఉంది. నవరత్న కూల్ టాల్క్ పౌడర్ ఇమామీ గ్రూప్‌దే. ఇపుడు డర్మీ కూల్ చేయడంతో ఈ విభాగంలో ఇమామీ పట్టు మరింత పెరిగింది. ఇమామీ షేర్ ఇవాళ రూ. 449 వద్ద ముగిసింది.