For Money

Business News

దివాలా తీసిన సూపర్‌ టెక్‌

ఢిల్లీకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సూపర్‌టెక్‌ సంస్థ దివాలా తీసింది. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో యూనియన్‌ బ్యాంక్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను ఇవాళ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (NCLT) అనుమతించింది. హితేష్‌ గోయల్‌ను దివాలా ప్రక్రియ పరిష్కార నిపుణుడిగా (Insolvency Resolution Professional -IRP)గా నియమించింది. ఈ తీర్పుతో సుమారు 25 వేల గృహ కొనుగోలుదారులపై ప్రభావం పడనుంది . NCLT తీర్పుపై జాతీయ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ ( NCLAT )ను ఆశ్రయించనున్నట్లు సూపర్‌టెక్‌ తెలిపింది. ఉత్తరప్రదేశ్ పరిధిలోని నోయిడాలో సూపర్‌టెక్ కంపెనీ నిర్మించిన ట్విన్ టవర్స్‌ను కూల్చివేయాలని సుప్రీంకోర్టు సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కంపెనీపై ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటోంది. బకాయిలు చెల్లింపులో కంపెనీ విఫలమైందంటూ NCLTని యూనియన్ బ్యాంక్ ఆశ్రయించింది. అయితే , మార్చి 17న కంపెనీ చేసిన వన్ టైమ్ సెటిల్మెంట్ ప్రతిపాదనకు బ్యాంక్ నిరాకరించింది. సూపర్‌ టెక్‌ కంపెనీ ప్రస్తుతం గురుగ్రామ, ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడాలోని పలు చోట్ల చేపట్టిన వివిధ ప్రాజెక్టులు నడుస్తున్నాయి.