ఇమామి షేర్ల బైబ్యాక్
డిసెంబరు త్రైమాసికానికి రూ .219.52 కోట్ల నికరలాభాన్ని ఇమామి ప్రకటించింది. 2020-21 ఇదే కాలంలో కంపెనీ లాభం రూ .208.96 కోట్లతో పోలిస్తే, ఇది 5.05 శాతం ఎక్కువ. ఇదే సమయంలో కంపెనీ టర్నోవర్ రూ .933.61 కోట్ల నుంచి రూ .971.85 కోట్లకు పెరిగింది. వ్యయాలు కూడా రూ.593.42 కోట్ల నుంచి రూ .630.31 కోట్లకు చేరాయి. దేశీయ వ్యాపారం కేవలం 3 శాతం వృద్ధి చెందగా , ఇ కామర్స్ విభాగం అమ్మకాలు 75 శాతం పెరిగినట్లు కంపెనీ తెలిపింది. కొవిడ్ ఇబ్బందులు ఉన్నా, డిసెంబరు త్రైమాసికంలో రాణించినట్లు ఇమామి డైరెక్టర్ మోహన్ గోయెంకా తెలిపారు. కంపెనీ క్యాపిటల్‌లో 10 శాతం వాటాకు సమాన షేర్లను బైబ్యాక్ చేయాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. షేరు ధర రూ.550 మించకుండా కొంటారు. దీంతో ప్రమోటర్ల వాటా 53.86 శాతం నుంచి 54.21 శాతానికి పెరుగుతంది. రూ .4ల రెండో మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.