For Money

Business News

రోజర్‌పేపై ఈడీ చార్జిషీట్‌

మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ప్రముఖ పేమెంట్‌ గేట్‌వే రోజర్‌ పేతో పాటు మరో మూడు ఫిన్‌ టెక్‌ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసింది. నిధులను మళ్ళించడంతో పాటు అనేక మందిని మోసం చేశారని ఈడీ పేర్కొంది. ఈకేసులో కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలను కూడా ఈడీ చేర్చింది. మూడు ఫిన్‌ టెక్‌ కంపెనీలు చైనీయుల చేతిలో ఉన్నట్లు ఈడీ తన చార్జిషీటులో పేర్కొంది. మొత్తం ఏడు కంపెనీలు, అయిదుగురు వ్యక్తులను నిందితులుగా చార్జిషీటులో వెల్లడించింది. రోజర్‌ పేతో పాటు మ్యాడ్ ఎలిఫెంట్‌ నెట్‌వర్క్‌ టెక్నాలజీ, బార్‌యానిక్స్‌ టెక్నాలజీ, క్లౌడ్‌ అట్లాస్‌ కంపెనీల పేర్లు చార్జిషీటులో ఉన్నాయి. డిజిటల్‌ పద్ధతిలో రుణాలు ఇచ్చేందుకు మూడు ఎన్‌బీఎఫ్‌సీలతో ఈ ఫిన్‌ టెక్‌ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆధారాలు ఉన్నాయని ఈడీ పేర్కొంది.