టెక్‌తోపాటు ఎకానమీ షేర్లలో ర్యాలీ
నిన్న కనిష్ఠ స్థాయి నుంచి కోలుకున్న వాల్‌స్ట్రీట్ ఇవాళ కూడా అదే ఉత్సాహాన్ని చూపిస్తోంది. ఫెడరిజర్వ్ వచ్చే జూన్,జులై సమావేశాల్లో అర శాతం వడ్డీని పెంచుతుందని ఫెడ్ మినిట్స్‌లో వెల్లడి అయ్యే సరికి మార్కెట్లో కాస్త రిలీఫ్ వచ్చింది. దీంతో బాండ్ ఈల్డ్స్‌తో పాటు డాలర్ కూడా క్షీణించింది. డాలర్ ఇండెక్స్ 102 కంటే దిగుకు వచ్చేసింది. యూరప్ ఈక్విటీ మార్కెట్లు రెండు శాతంపైగా లాభంతో ముగిశాయి. యూరోస్టాక్స్ 50 సూచీ రెండున్నర శాతంపైగా లాభంతో ముగిసింది. వాల్‌స్ట్రీట్‌లో నాస్ డాక్ 2.9 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 2 శాతం, డౌజోన్స్ 1.67 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. టెక్ షేర్లన్నీ రెండు నుంచి ఆరు శాతం వరకు లాభంతో ట్రేడవుతున్నాయి.