వోడాఫోన్లో e&కి 9.8 శాతం వాటా
భారీ నష్టాల్లో కూరుకుపోయిన వొడాఫోన్ కంపెనీలో 9.8 శాతం వాటాను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు ఎమిరేట్స్ కమ్యూనికేషన్స్ గ్రూప్ కంపెనీ e& కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 440 కోట్ల డాలర్లు. టెలికాం వెలుపల ఫైనాన్షియల్ టెక్నాలజీస్ రంగంలో పెట్టుబడి పెట్టాలని e& భావిస్తోంది. 4430 కోట్ల యూరోల రుణంలో ఉన్న వొడాఫోన్ కంపెనీ టెలికాంతో పాటు ఫిన్‌టెక్ రంగంలో ప్రవేశించే వీలు ఉంది. ఆఫ్రికా, యూరప్, ఆసియా మార్కెట్లలో విస్తరించాలని, ముఖ్యంగా ఫిన్ టెక్ రంగంలోకి ప్రవేశించాలని తాము భావిస్తున్నామని e& వెల్లడించింది. అనేక దేశాల్లో టెలికాం ధరలపై ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తుండటంతో వొడాఫోన్ తీవ్రంగా నష్టపోతోంది. e&పెట్టుబడితో వొడాఫోన్ వివిధ దేశాల్లో మరింత విస్తరించేందుకు ప్రయత్నించవచ్చు.