బినాన్స్‌కు దుబాయ్ క్రిప్టో లైసెన్స్
దుబాయ్‌లో కొన్ని కార్యకలాపాలు నిర్వహించేందుకు బినాన్స్‌కు అనుమతి లభించింది. బినాన్స్ ప్రపంచంలోనే అతి పెద్ద క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీ. దుబాయ్ కేంద్రంగా ప్రాంతీయ ప్రాంతాన్ని బినాన్స్ నిర్వహించుకోవచ్చు. ఇటీవలే దుబాయ్ ప్రభుత్వం వర్చువల్ అసెట్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేసింది. ఆ అథారిటీ ఇవాళ బినాన్స్‌కు లైసెన్స్ మంజూరు చేసింది.నిన్ననే బినాన్స్‌కు క్రిప్టో అసెట్ సర్వీస్ ప్రొవైడర్ లైసెన్స్‌ను బహెరెయిన్ మంజూరు చేసింది. గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ)లో ఇచ్చిన తొలి క్రిప్టో లైసెన్స్ ఇదే. దుబాయ్ వరల్డ్ సెంటర్లో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ హబ్‌ను కూడా బినాన్స్ ఏర్పాటు చేస్తుంది.