డౌ జోన్స్ ఫ్యూచర్స్ వంద పాయింట్లు డౌన్
నష్టాల నుంచి కోలుకుందని కాస్త సంతోష పడేలోగానే అమెరికా ఈక్విటీ మార్కెట్లు మళ్ళీ డీలా పడ్డాయి. ఫ్యూచర్స్‌లో డౌజోన్స్ 130 పాయింట్లు క్షీణించగా, ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా 0.3 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇవాళ ఇన్వెస్టర్లు ప్రధానంగా టెక్ కంపెనీల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.అలాగే ఎలాన్ మస్క్ ట్విటర్ ఏం చేయబోతోరా అనే చర్చ కూడా మార్కెట్‌లో జరుగుతోంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో నెట్‌ఫ్లెక్స్ ప్రకటించిన ఫలితాలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఇవాళ గూగుల్ (ఆల్ఫాబెట్) మైక్రోసాఫ్ట్ తమ ఫలితాలను ప్రకటించనున్నాయి. అలాగే ఎకానమీ షేర్లలో డెలివరీ సంస్థ యూపీఎస్, పెప్సికో, 3ఎం కంపెనీలు కూడా ఫలితాలు ప్రకటించనున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు నాస్‌డాక్ 17 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 10 శాతం, డౌజోన్స్ ఆరు శాతం క్షీణించాయి. ఫెడ్ వడ్డీ రేట్లను మార్కెట్ డిస్కౌంట్ చేసిందని అనుకుంటున్నా… ఇతర కారణాలతో మార్కెట్ పడుతూనే ఉంది.