భారీగా క్షీణించిన డౌజోన్స్
ఇవాళ విడుదలైన కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) డేటా వాల్‌స్ట్రీట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. ముఖ్యంగా డౌజోన్స్ భారీగా నష్టపోయింది. తాజా సమాచారం మేరకు డౌజోన్స్ సూచీ 1.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇతర సూచీల పతనం కూడా భారీగానే ఉంది. నాస్‌డాక్ 0.8 శాతం నష్టంతో ఉంది. వినియోగదారుల సూచీ మార్కెట్ అంచనాలకు అనుగుణంనగానే ఉంది. జులైలో ఈ సూచీ 2.9 శాతం ఉండగా, ఆగస్టులో 2.5 శాతంగా నమోదైంది. అంటే ధరల పెరుగుదల భారీగా లేదన్నమాట. దీంతో ఈనెల 18న ఫెడరల్ రిజర్వ్ అర శాతం మేర వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. తాజా డేటాతో కేవలం 0.25 శాతం మాత్రమే తగ్గించవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో ఎకానమీ షేర్లకు ప్రాతినిధ్యం వహించే డౌజోన్స్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. క్లోజింగ్ వరకు సూచీలు ఇదే విధంగా ఉంటాయా? కోలుకుంటాయా అన్నది చూడాల్సి ఉంది. డాలర్ ఇండెక్స్‌లో పెద్ద మార్పులు లేవు. క్రూడ్ స్వల్పంగా పెరిగినా 70 డాలర్ల లోపే ఉంది. ఒక బులియన్ ధరల్లో కూడా పెద్ద మార్పులు లేవు.