సిలెండర్‌కు ఆధార్ తరహా క్యూఆర్ కోడ్
ఇంటి అవసరాలకు వాడే ఎల్‌పీజీ సిలెండర్లకు ఆధార్ తరహా క్యూఆర్ కోడ్‌ను ఇవ్వాలని మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయించాయి. పాత సిలెండర్లకు క్యూఆర్ కోడ్ ఉన్న ప్లాస్టిక్ స్టిక్కర్లు ఇస్తారు. కొత్తవాటికి మెటల్‌తో చేసిన క్యూఆర్ కోడ్ వస్తుంది. దీంతో ఏ సిలెండర్ ఎక్కడ ఉందో ఇట్టే అర్థమౌపోతుంది. గోడౌన్ నుంచి కస్టమర్ ఇంటి వరకు మధ్యలో సిలెండర్ ఎక్కడ ఉందో కూడా దీనివల్ల కంప్యూటర్‌లో చూసుకోవచ్చు. మధ్యలో గ్యాస్‌ను కొట్టేయకుండా… సిలెంటర్లకు వాణిజ్య అవసరాలకు వాడకుండా ఈ పద్ధతి వల్ల నివారించవచ్చు. అలాగే ఎప్పటికపుడు డిమాండ్‌ను బట్టి సరఫరాను అంచనా వేసే అవకాశం కూడా ఉంటుంది.