For Money

Business News

కుప్పకూలిన క్రూడ్‌ ఆయిల్‌

చైనాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని, ఆంక్షల కారణంగా క్రూడ్‌ ఆయిల్‌ డిమాండ్‌ తగ్గవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రూడ్‌ ధరలు భారీగా క్షీణించాయి. ఇవాళ ఒక్క రోజూ బ్రెంట్‌ కూడా 5 శాతంపైగా క్షీణించి 83 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. WTII క్రూడ్‌ కూడా 5శాతంపైగా నష్టంతో 76 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత కొన్ని రోజులుగా బలహీనంగా ఉన్న డాలర్‌ కూడా ఇవాళ భారీగా పెరిగింది. డాలర్‌ ఇండెక్స్‌ మళ్ళీ 107ను దాటింది.దీంతో బులియన్‌లో కూడా ఒత్తిడి వచ్చింది. బంగారం, వెండి కూడా ఒక శాతంపైగా క్షీణించాయి