జెట్ స్పీడుతో డాలర్ జంప్
నిన్న ఒక మోస్తరుగా నష్టపోయిన డాలర్ ఇవాళ భారీ లాభాలతో ట్రేడవుతోంది. కరెన్సీ మార్కెట్లో హెచ్చతుగ్గులు చాలా వరకు తక్కువగా ఉంటాయి. అమెరికా రీటైల్ సేల్స్ గణాంకాలు బాగుండటంతో పాటు ఫెడరల్ రిజర్వ్ మినిట్స్ బయటకు రావడంతో… వడ్డీ రేట్లను త్వరలోనే పెంచుతారని అనలిస్టులు అంటున్నారు. దీంతో బాండ్ ఈల్డ్స్‌తో పాటు డాలర్ కూడా భారీగా పెరిగింది. డాలర్ ఇండెక్స్ ఇపుడు 0.94 శాతం లాభంతో ట్రేడవుతోంది. అయితే డాలర్ భారీగా పెరిగినపుడు బాగా పడాల్సిన క్రూడ్ ఆయిల్ తగ్గకపోగా పెరుగుతోంది. అంటే భారత్ వంటి మార్కెట్లకు ఇది పెద్ద నెగిటివ్ న్యూస్. డాలర్‌కు బులియన్ బాగా రియాక్టయింది. బులియన్ ఔన్స్ ధర 1.2 శాతంపైగా క్షీణించడంతో 1779 డాలర్లకు పడింది. వెండి మాత్రం అర శాతం నష్టానికి పరిమితమైంది.