రుణ వసూలుకు థర్డ్ పార్టీ ఏజెంట్లు వొద్దు
రుణాల వసూలు కోసం థర్డ్ పార్టీ సంస్థలు అంటే మరో సంస్థ రికవరీ ఏజెంట్లను పంపొద్దని మహీంద్రా ఫైనాన్స్‌కు ఆర్బీఐ ఆదేశించింది. సాధారణంగా ఫైనాన్స్ కంపెనీ రుణాల వసూలు కోసం తమ కంపెనీ సిబ్బందిని కాకుండా… మరో సంస్థ సేవలు తీసుకుంటాయి. ఆ సంస్థకు చెందిన సిబ్బంది రుణాలు వసూలు చేస్తాయి. ఇలాంటి వారి వేధింపులు తీవ్రంగా ఉంటాయి. మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ తరఫున ఇలా థర్డ్ పార్టీ రికవరీ ఏజెంట్లు వెళ్ళి వేధించడమే గాక.. గర్భవతి అయిన ఓ మహిళను చంపేశారు. ఈ విషయం తన దాకా వెళ్ళడంతో ఆర్బీఐ వెంటనే ఆదేశాలు జారీ చేసింది.