For Money

Business News

NIFTY TRADE: ఆప్షన్స్‌ జోలికి వెళ్ళొద్దు

మార్కెట్‌లో పుట్‌ రైటింగ్‌ దాదాపు లేదు. అంటే మార్కెట్‌ ఎంత వరకు పడుతుందనే అంచనా ట్రేడర్లలో లేదు. ఇలాంటి సమయంలో ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ జోలికి వెళ్ళొద్దని సీఎన్‌బీసీ ఆవాజ్‌ డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ కుమార్‌ అంటున్నారు. నిన్న ఒక వారంలో రూ. 22,256 కోట్ల విలువైన షేర్లను విదేశీ ఇన్వెస్టర్లు అమ్మారు. నిఫ్టికి సపోర్ట్‌ లెవల్స్‌ అన్ని పోయాయి. ఈ నేపథ్యంలో భారీ నష్టాలతో ప్రారంభమైతే… వెంటనే కొనుగోలు చేయొద్దని వీరేందర్ సలహా ఇస్తున్నారు. మార్కెట్‌ పెరిగే వరకు ఆగి అమ్మాలని సలహా ఇస్తున్నారు.నిఫ్టికి 16000 లేదా 15860 ప్రాంతంలో మద్దతుకు ఛాన్స్‌ ఉందని వీరేందర్‌ అంటున్నారు. ఈ స్థాయిలో మద్దతు రాకపోతే తరువాతి స్థాయి 15790 నుంచి 15740గా ఆయన పేర్కొన్నారు. చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్‌కు దూరంగా ఉండటం బెటర్‌. ముఖ్యంగా ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ జోలికి అస్సలు వెళ్ళొద్దు. ఆప్షన్స్‌ను అంచనా వేసేందుకు కూడా ట్రేడ్స్‌ లేవని వీరేందర్‌ అంటున్నారు.

https://www.youtube.com/watch?v=xxuc36nDQeU