ఈ షేర్ వెంట పడకండి
ఇటీవలి కాలంలో ఎస్‌బ్యాంక్ షేర్ భారీగా పెరిగింది.ఈ షేర్ ఇవాళ మోర్గాన్ స్టాన్లీ తన నివేదిక ఇచ్చింది. 2025 ఆర్థిక సంవత్సరం కల్లా రిటర్న్ ఆన్ అసెట్స్ ఒక శాతం వరకు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. క్రమంగా ఇది ఇంకా పెరుగుతూ పోతుందని అంచనా వేస్తోంది. టెక్నికల్ అనలిస్ట్ ఆశిష్ బహెతి ఈ షేర్ గమనం గురించి కామెంట్ చేస్తూ…ఇప్పటికే ఈ షేర్ కొన్నవారు రూ. 22.50 స్టాప్‌లాస్‌తో కొనసాగవచ్చని అన్నారు. నిన్న ఈ షేర్ రూ. 23.95 వద్ద ముగిసింది. అయితే కొత్తగా ఈ షేర్‌ను కొనడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం అని ఆయన అన్నారు. ఇప్పటికే ఈ షేర్ బాగా పెరిగిందని… ఈ షేర్ వెంట పడకపోవడం మంచిదని అన్నారు. కరెక్షన్ వచ్చిన తరవాత కొనే అంశాన్ని పరిశీలించవచ్చని ఆయన సలహా ఇచ్చారు.