For Money

Business News

తెలుగు రాష్ట్రాల్లో నంబర్‌ వన్‌ శ్రీమంతుడు

దక్షిణాది నుంచి అత్యంత సంపన్నుల జాబితాలో తమిళనాడుకు చెందిన శివనాడార్‌ (హెచ్‌సీఎల్‌ గ్రూప్‌) నంబర్  వన్‌ స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో దివీస్‌ ల్యాబ్స్‌ ప్రమోటర్లు దివి మురళీ, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. మూడో స్థానంలో విప్రో కంపెనీ అధినేత అజీమ్‌ ప్రేమ్‌జీ, ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. ఐఐఎఫ్‌ఎల్‌ హురూన్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2021 ప్రకారం రూ. 2,36,600 కోట్ల సంపదతో శివనాడార్‌ మొదటిస్థానంలో ఉన్నారు. ఇక రెండో స్థానంలో ఉన్న దివీస్‌ మురళీ, ఆయన కుటుంబ సభ్యులు సంపద రూ.79,000 కోట్లుగా లెక్కగట్టారు. ఇక మూడో స్థానంలో ఉన్న అజీమ్‌ ప్రేమ్‌జీ, ఆయన కుటుంబ సభ్యుల సంపద రూ.36,900 కోట్లు. ఈఏడాది కూడా దేశంలో అత్యంత సంపన్నుడిగా ముకేష్‌ అంబానీ రాగా, రెండో స్థానం అదానీ గ్రూప్‌ దక్కించుకుంది. ఈ సారి కూడా హైదరాబాద్‌ అత్యధిక సంపన్నులు ఉన్న నగరాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. మొదటిస్థానం ముంబైది. ఇక్కడ 255 మంది కోటీశ్వరులు ఉండగా, ఢిల్లీలో 167 మంది ఉన్నారు. ఇక మూడో స్థానంలో ఉన్న బెంగళూరులో 85 మంది కోటీశ్వరులు ఉండగా, హైదరాబాద్‌లో ఈ సంఖ్య 56. ఆరుగురితో చెన్నై తరువాతి స్థానంలో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే 63 మంది కోటీశ్వరులు ఉన్నారు. ఏపీలో వీరి సంఖ్య ఆరు.