సర్వీస్ చార్జీలపై హైకోర్టు స్టే
హెటళ్ళు, రెస్టారెంట్లు తమ కస్టమర్ల నుంచి సర్వీస్ చార్జీలు వసూలు చేయరాదంటూ సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) జారీ చేసిన ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. సీసీపీఏ నిబంధనలను చూస్తుంటేనే ప్రస్తుతం చట్టాలకు విరుద్దంగా ఉన్నాయని కోర్టు పేర్కొంది. వినియోగదారుల సంరక్షణ చట్టంలోని సెక్షన్ 2(47) పరిధిలోకి వస్తాయా అన్న అంశంపై కోర్టు అనుమానం వ్యక్తం చేసింది. 1964లో వచ్చిన వేజ్ బోర్డు ప్రకారం కస్టమర్ల బిల్లుపై 5 శాతం నుంచి 10 శాతం వరకు సర్వీస్ చార్జి వసూలు చేయొచ్చనే నిబంధన ఉందని కోర్టులో పిటీషనర్లు వాదించారు. దీంతో కోర్టు స్టే ఇచ్చింది. కోర్టు ఆదేశాలపై అప్పీల్‌కు వెళతామని సీసీపీఏ అంటోంది.