For Money

Business News

5 శాతం పెరిగిన క్రూడ్‌ ఆయిల్‌

ఉదయం నుంచి చాలా మార్కెట్లు కోలుకుంటున్నాయి. ముఖ్యంగా క్రూడ్‌ ఆయిల్‌ ఇవాళ 5 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. గత శుక్రవారం ఆయిల్ 10 శాతంపైగా క్షీణించిన విషయం తెలిసిందే. గతవారం భారీ అమ్మకాల కారణంగా దిగువస్థాయిలో కొనుగోళ్ళ మద్దతు లభిస్తోందని ట్రేడర్లు అంటున్నారు. అలాగే డాలర్‌ కూడా స్వల్ప పెరగడంతో క్రూడ్‌ ధర మరింత పెరిగిగనట్లే. ఒమైక్రాన్‌ వైరస్‌ బయటపడిన తరవాత పరిస్థితిని ఒపెక్‌ దేశాలు సమీక్షించనున్నాయి. ఉత్పత్తిని తగ్గించే అంశాన్ని ఒపెక్‌ దేశాలు ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి. దీంతో క్రూడ్‌ పెరుగుతోంది.