మళ్ళీ 120 డాలర్లకు బ్రెంట్

షేర్ మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ఉన్నా… డాలర్ కూడా పటిష్ఠంగా ఉంది. ప్రపంచంలోని అతి ప్రధాన ఏడు కరెన్సీలతో డాలర్ విలువను తెలిపే డాలర్ ఇండెక్స్ 102 వద్ద ఉంటోంది. అయినా క్రూడ్ భారీగా పెరగడం భారత్ వంటి దేశాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్ ధర 120 డాలర్లకు చేరగా, అమెరికా క్రూడ్ WTI ధర 116 డాలర్లను దాటింది. కరోనా నుంచి చైనా కోలుకుండటం, అమెరికా వేసవిలో క్రూడ్ వినియోగం పెరగడంతో క్రూడ్ డిమాండ్ పెరుగుతోంది. అయితే ఒపెక్, ఇతర దేశాలు క్రూడ్ సరఫరాను పెంచడం లేదు. దీంతో క్రూడ్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. డాలర్ బలంగా ఉన్న సమయంలో క్రూడ్ బలహీనంగా ఉండటం సాధారణం. కాని రెండు ఒక దిశలో పయనిస్తుండటంతో భారత్ ఆయిల్ దిగుమతులకు భారీ మొత్తాన్ని కేటాయించాల్సి వస్తోంది.