కుప్పకూలిన క్రూడ్ ఆయిల్
చైనాలో కరోనా కేసులు పెరగడం, వాణిజ్య నగరం షెజెన్ను మూసేయడంతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా క్షీణించాయి. కోటి 75 లక్షల మంది ఉన్న ఓ మహానగరంలో లాక్డౌన్ ప్రకటించడంతో చమురు డిమాండ్ ఒక్కసారిగా తగ్గింది. దీంతో ధరలు ఏడు శాతంపైగా క్షీణించి 104.7 డాలర్లకు పడిపోయింది. ఇదే సమయంలో డాలర్ కూడా తగ్గడంతో ఇతర కరెన్సీలలో క్రూడ్ ధరలు ఇంకా తగ్గినట్లు. చైనాలో పరిణామాలతో పాటు రష్యా, ఉక్రెయిన్ల మధ్య కూడా చర్చలు ఫలవంతమౌతాయనే వార్తలు కూడా వస్తున్నాయి. అమెరికాతో సహా పలు నాటో దేశాలు భారత్ వంటి వర్ధమాన దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతులపై ఆంక్షలు లేకపోవడం వల్ల కూడా చమురు సరఫరా బాగానే ఉంది. అమెరికాలో షేల్ గ్యాస్ బావుల సంఖ్య కూడా గతవారం పెరిగింది. వీటన్నింటి కారణంగా ముడి చమురు ధరలు క్షీణించాయి.