For Money

Business News

క్రూడ్‌ ఆయిల్ @ 122

కరోనా తరవాత క్రూడ్‌ ఆయిల్ బ్యారల్‌ ధర 123 డాలర్లను దాటింది. ఇపుడు పరిస్థితి చూస్తుంటే మళ్ళీ ఆ రికార్డును ఆయిల్ బద్ధలు కొట్టేలా కన్పిస్తోంది. రష్యా నుంచి యూరప్ దేశాలు క్రూడ్‌ ఆయిల్‌ను భారీగా దిగుమతి చేసుకుంటాయి. ఉక్రెయిన్‌పై దాడి తరవాత రష్యా ఆయిల్‌ దిగుమతులను చాలా దేశాలు తగ్గించాయి. కాని కొన్ని దేశాలు ససేమిరా అన్నాయి. తాజాగా నిన్న సమావేశమైన యూరప్‌ దేశాలు రష్యా ఆయిల్ దిగుమతలను ఈ ఏడాది చివరికల్లా 90 శాతం నిలిపివేయాలని నిర్ణయించాయి. దీంతో రాత్రి నుంచి క్రూడ్‌ ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్‌ ధర 122.30 డాలర్లకు తాకింది. అలాగే WTI క్రూడ్‌ ధర కూడా 117.65 డాలర్లను తాకింది. మరోవైపు డాలర్‌ ఇండెక్స్‌ 101పైన ఉంటోంది. దీంతో భారత్‌ వంటి దేశాలు ముడి చమురు దిగుమతుల కోసం భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు యూరప్‌ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నాయి. జర్మనీ వంటి దేశాలు కతర్‌తో చర్చలు జరుపుతోంది.