చుక్కలు చూపుతున్న క్రూడ్
క్రూడ్ ఆయిల్ ధరలకు పట్టపగ్గాల్లేకుండా పెరుగుతోంది. క్రూడ్ ఉత్పత్తిని విషయమై తమ నిర్ణయాన్ని ఒపెక్ దేశాలు నవంబర్‌కు వాయిదా వేయడంతో డాలర్ పెరుగుతున్నా… క్రూడ్ ధరలు ఏమాత్రం తగ్గడం లేదు. తాజా సమాచారం మేరకు ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 83 డాలర్లను దాటేందుకు సిద్ధంగా ఉంది. తాజా సమాచారం మేరకు ధర 82.74 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అమెరికా వాడే WTI క్రూడ్ ధర కూడా దాదాపు రెండు శాతం పెరిగింది. అనేక దేశాల్లో నేచురల్ గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. దీంతో చాలా మంది పెట్రోల్, డీజిల్‌కు మారడంతో క్రూడ్ డిమాండ్ మరింత పెరిగింది. డాలర్ ఇండెక్స్ 94 దాటేందుకు సిద్ధంగా ఉంది. డాలర్ గ్రీన్‌లో ఉన్నందున బులియన్ ఇవాళ మరింత వీక్‌గా ట్రేడవుతోంది. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 1760 డాలర్ల వద్ద ఉంది. 1756 డాలర్లు కీలక స్థాయి. ఈ స్థాయికి దిగున వెళితే మళ్ళీ 1736 డాలర్లను తాకే అవకాశముంది. వెండి కూడా దిగువ స్థాయిలో స్థిరంగా ఉంది.