క్రూడ్ ధరల్లో భారీ జంప్
రష్యా తాజా హెచ్చరికతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. గత నెల రెండో వారంలోబ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 75 డాలర్ల ప్రాంతంలో ఉండగా. ఇవాళ 84.50 డాలర్లకు చేరింది. రాత్రి నుంచి బ్రెంట్ క్రూడ్ 4 శాతం దాకా పెరిగింది. తమ ఆయిల్ కొనుగోళ్ళపై అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు విధించాక.. రెండు వారాల నుంచి మౌనంగా ఉన్న రష్యా ఇపుడు స్పందించింది. రోజువారీ క్రూడ్ ఉత్పత్తిని 8 లక్షల బ్యారెల్స్ నుంచి 7 లక్షల బ్యారెల్స్‌ను తగ్గిస్తానని హెచ్చరించింది. రష్యా డిప్యూటీ ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ ఈ ప్రకటన చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి రష్యా ప్రభుత్వం ఇంకా అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. డాలర్ చాలా వీక్‌గా ఉన్నందున డాలర్ ఇప్పటికే పెరుగుతున్న విషయం తెలిసిందే.