For Money

Business News

క్షణాల్లోలాభాల స్వీకరణ… కాని

ఉదయం నిఫ్టి సమీక్షలో పేర్కొన్నట్లే తొలి ర్యాలీ పోయింది. నిఫ్టి 17867ను తాకిన తరవాత కొన్ని నిమిషాల్లోనే లాభాలన్నీ పోయాయి. 17,774 పాయింట్లను తాకింది. ఉదయం రివ్యూలో పేర్కొన్నట్లు తొలి ర్యాలీని అమ్మేశారు. ఇపుడు మళ్ళీ 17,774 నుంచి నిఫ్టి కోలుకుని 17837 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 31 పాయింట్ల లాభంతో ఉంది. మరి దిగువ స్థాయిలో అందిన మద్దతు ఎంత వరకు కొనసాగుతుందో చూడాలి. ఉదయం దిగువ స్థాయిలో కొనుగోలు చేసినవారు 40 లేదా 50 పాయింట్ల స్టాప్‌లాప్‌తో పొజిషన్‌ కంటిన్యూ చేయొచ్చని అనలిస్టులు అంటుననారు. అంటే నిఫ్టి 17720 లేదా17730ని స్టాప్‌లాస్‌తో ఉంచుకోవచ్చు. ఇవాళ ఉదయం హాంగ్‌సెంగ్‌, సింగపూర్‌ మార్కెట్లకు సెలవు. అలాగే యూరో మార్కెట్లలో జర్మనీ వంటి ప్రధాన మార్కెట్లకు క్రిస్మస్ సెలవులు ఉన్నాయి. షేర్లకు విషయంలో మాత్రం అమ్మకాలకు ఛాన్స్‌ ఉంది. ఇవాళ నిఫ్టి ట్రెండ్ పూర్తిగా బ్యాంక్‌ నిఫ్టిపై ఆధారపడి ఉండే అవకాశముంది. ఇక షేర్ల విషయానికొస్తే … ఇటీవల బాగా క్షీణించిన అదానీ గ్రూప్ షేర్లు ఇవాళ గ్రీన్‌లో ఉన్నాయి. దివీస్‌ ల్యాబ్‌ రూ.45 దాకా పెరిగినా.. ఇపుడు 15 లాభంతో రూ. 3512 వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్‌ షేర్లలో మిడ్‌ క్యాప్‌ పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.18 లాభంతో రూ. 3600పైన ట్రేడవుతోంది. ఎల్‌ఐసీ ఇటీవల భారీగా క్షీణించి ఇవాళ రూ. 11 లాభంతో రూ. 670 వద్ద ఉంది. ఇటీవల బాగా క్షీణించిన కెపీఐ టెక్‌ కూడా రూ. 23 లాభంతో ట్రేడవుతోంది.