For Money

Business News

IPO: రణబీర్‌, అమీర్‌ ఖాన్‌… పెట్టుబడి డబుల్‌

డ్రోన్‌ల తయారీ రంగంలో నిమగ్నమైన డ్రోన్‌ ఆచార్య ఏరియల్‌ ఇన్నోవేషన్స్‌ పబ్లిక్‌ ఆఫర్‌లో షేర్లు పొందిన ఇన్వెస్టర్ల పెట్టుబడి రెండు వారాల్లోనే రెట్టింపు అయింది. ప్రమఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ శంకర్‌ శర్మ కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. ఆయనతో పాటు బాలీవుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌, రణబీర్‌ కపూర్‌ కూడా పెట్టుబడి పెట్టారు. అమీర్‌ ఖాన్‌తో కంపెనీలో పబ్లిక్‌ ఆఫర్‌కు ముందే 25 లక్షల షేర్లు కొనుగోలు చేయగా, రణబీర్‌ కపూర్‌ 37200 షేర్లు కొనుగోలు చేశారు. శంకర్‌ శర్మతో పాటు వీరందరూ రూ. 54 ధరకు ఈ షేర్లను కొన్నారు. సాధారణ ఇన్వెస్టర్లకు మంచి ప్రతిఫలం అందాలని వీరు తాము కొన్న ధరకే ఇన్వెస్టర్లకు షేర్లు ఆఫర్‌ చేయాలని నిర్ణయించారు. పబ్లిక్‌ ఆఫర్‌లో రూ. 54లకే ఆఫర్‌ చేశారు. రీటైల్‌ పోర్షన్‌ ఇష్యూ ఏకంగా 37 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఈ కంపెనీ షేర్లు గత శుక్రవారం బీఎస్‌ఈలో లిస్ట్‌ అయ్యాయి. లిస్టింగ్‌ రోజే ఈ షేర్‌ రూ.102 వద్ద లిస్ట్ అయింది. అదే రోజు రూ. 107.10 వద్ద క్లోజైంది. ఇవాళ కూడా ఈ షేర్‌ 5 శాతం అప్పర్‌ సీలింగ్‌ రూ. 112.45 వద్ద ట్రేడవుతోంది. ఈ ధర వద్ద 12.34 లక్షల షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు రెడీగా ఉన్నారు. అమ్మేవారు లేరు. సో…ఈ పబ్లిక్‌ ఆఫర్‌తో అమీర్‌ ఖాన్‌, రణబీర్‌ కపూర్‌ పెట్టుబడి డబుల్ అయిందన్నమాట.