For Money

Business News

అప్రూవర్‌గా మారిన వీడియోకాన్‌ అధినేత

ఐసీఐసీఐ బ్యాంక్ రుణాల కేసులో వీడియోకాన్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ అయిన వేణుగోపాల్‌ ధూత్‌ అప్రూవర్‌గా మారారు. ఆయనను ఇవాళ సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. 2012లో ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి వీడియోకాన్‌ గ్రూప్‌ రూ. 3,250 కోట్ల రుణం తీసుకుంది. దీనికి బదులుగా ఐసీఐసీఐ బ్యాంక్‌ అప్పటి సీఈఓ చందా కొచ్చర్‌ భర్త దీపక్‌ కొచ్చర్‌కు చెందిన కంపెనీలో పెట్టుబడి రూపంలో కొంత మొత్తాన్ని వీడియోకాన్‌ గ్రూప్‌ పెట్టుబడి పెట్టింది. ఈ క్విడ్‌ ప్రొ క్వొ కేసులో చందా కొచ్చర్‌, దీపక్‌ కొచ్చర్‌లను సీబీఐ ఇది వరకే అరెస్ట్‌ చేసింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారుతానని వేణుగోపాల్‌ ధూత్‌ పేర్కొనడంతో.. అతన్ని ఇవాళ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చనున్నారు. అతను అ్రపూవర్‌గా మారితే ఉపయోగమేనని కోర్టు భావిస్తే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుంది. అపుడు కస్టోడియల్‌ విచారణ సమయంలో వేణుగోపాల్‌ ధూత్‌కు కొన్ని వెసులుబాట్లు ఉంటాయి.