క్రూడ్ ఆయిల్ ఢమాల్
ఒమైక్రాన్ దెబ్బకు ప్రపంచ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. షేర్ మార్కెట్, కరెన్సీ మార్కెట్, బులియన్ మార్కెట్‌తో పాటు క్రూడ్ ఆయిల్ మార్కెట్ కూడా నష్టాల్లో ఉంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా ఒకేరోజు WTIక్రూడ్ ఆయిల్ ఆరు శాతంపైగా నష్టపోగా, ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్ 5 శాతంపైగా క్షీణించింది. గత వారం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 76 డాలర్లకు తాకగా, ఇవాళ 69.69 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. కరెన్సీ మార్కెట్లో డాలర్ స్వల్పంగా తగ్గింది. లేకుంటే పతనం ఇంకా జోరుగా ఉండేది. ఒమైక్రాన్ మరణాలు నమోదు కావడం ప్రారంభం కావడంతో యూరోపియన్ దేశాల్లో లాక్డౌన్లు పెట్టడం ఖాయమని ఆయిల్ మార్కెట్ భావిస్తోంది. క్రిస్మస్కు ముందే ఆంక్షలు పెట్టే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి.