భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధర
ఇవాళ ఉదయం బ్రెంట్ క్రూడ్ ధర 119.98 డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచ మార్కెట్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. క్రూడ్ భారీగా పెరిగే పక్షంలో అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతుంది. ఇప్పటికే అధిక ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న దేశాలకు ఇది పెద్ద షాక్. సరిగ్గా ఇదే సమయంలో ఇరాన్ చేసిన ప్రకటనతో క్రూడ్ ధర భారీగా తగ్గి ఇపుడు 112 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. తమపై విధించిన ఆంక్షలు ఎత్తివేతకు సంబంధించి రాగల 72 గంటల్లో అమెరికాతో ఒప్పందం కుదరవచ్చని ఇరాక్ ప్రకటించింది. దీంతో ఇరాక్ చమురు సరఫరాపై ఇపుడు ఉన్న ఆంక్షలు తొలిగి..భారీగా సరఫరా పెరగుతుంది. దీంతో క్రూడ్ ధర భారీగా తగ్గింది. మరోవైపు డాలర్ ఇవాళ అనూహ్యంగా అరశాతం దాకా పెరిగింది. డాలర్ ఇండెక్స్ 98ని దాటే పరిస్థితి కన్పిస్తోంది. క్రూడ్ తగ్గడానికి ఇది కూడా ఒక కారణం.