For Money

Business News

100 డాలర్లు దాటిన క్రూడ్‌

ఉక్రెయిన్‌ మిలిటరీ చర్యలకు రష్యా ఆదేశించడంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. రాత్రి భారీ నష్టాలతో వాల్‌ స్ట్రీట్‌ క్లోజ్‌ కాగా, ఫ్యూచర్స్‌ కూడా 2 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. మరోవైపు ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారల్ ధర 100 డాలర్లను దాటింది. ఇదే సమయంలో డాలర్‌ ఇండెక్స్‌ కూడా 0.4 శాతం పెరిగి 96.50ని తాకింది. మార్చి నెల క్రూడ్‌ ఫార్వర్డ్‌ కాంట్రాక్ట్ ప్రస్తుతం 99.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.