డాలర్, క్రూడ్ పోటీ పడి పెరుగుతున్నాయి
నిన్న 120 డాలర్లకు చేరిన బ్రెంట్ క్రూడ్ ధర రాత్రి 112 డాలర్లకు చేరినా.. మళ్ళీ ఉదయం పెరుగుతోంది. ఆసియా మార్కెట్లు ప్రారంభం కాగానే బ్రెంట్ క్రూడ్ ధర 3 శాతం పైగా పెరిగి 114 డాలర్లకు చేరింది. లిబియాలోని అల్ సహారా ఆయిల్ఫీల్డ్ నుంచి చమురు సరఫరా ఆగిపోవడం దీని కారణం. పైగా రష్యా నుంచి చమురు కొనుగోళ్ళపై ఎలాంటి ఆంక్షలు లేకున్నా… దిగుమతిదారులు కొనడం లేదు. దీంతో ఇతర మార్కెట్లలో చమురు ధరలు పెరుగుతున్నాయి. దీనికి తోడు డాలర్ రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా రూబల్ పతనం కావడంతో డాలర్ మరింత బలపడుతోంది. ఇవాళ ఉదయం డాలర్ ఇండెక్స్ 98ని తాకింది. ఇటు డాలర్, అటు క్రూడ్ ఆయిల్ పెరగడంతో భారత్ వంటి ఆయిల్ దిగుమతి కంపెనీలు భారీగా ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది.