For Money

Business News

సెబీ మాజీ ఛీఫ్‌పై కేసు

స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ అయిన సెబీ మాజీ చీఫ్‌ మాధబి పురీ బచ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ముంబైలోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆమెతో పాటు సెబీ ఉన్నతాధికారులపై కేసు కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాధురి ఫిబ్రవరి 28న సెబీ చీఫ్‌గా వైదొలిగారు. నిబంధనలకు విరుద్ధంగా ఒక కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ అయిందని పుణెకు చెందిన ఓ జర్నలిస్ట్‌ వేసిన కేసు కోర్టులో విచారణకు వచ్చింది. స్థానిక పోలీసులతో పాటు విచారణ సంస్థలకు ఫిర్యాదు చేసినా మాధురిపై చర్యలు తీసుకోలదేని పిటీషనర్‌ ఆరోపించారు. కేసు వివరాలను చూస్తుంటేనే అవినీతి జరిగిటన్లు అనుమానాలు వస్తున్నాయని… కాబట్టి మాధురిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.