ర్యాలీ కొనసాగుతుంది
గతవారం మన మార్కెట్లతో పాటు అమెరికా మార్కెట్లను చూస్తే నిఫ్టి ఆకర్షణీయ లాభాలు గడించే అవకాశముందని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని అన్నారు. గత వారం 15900 స్థాయికి వెళ్ళినపుడల్లా నిఫ్టికి మద్దతు లభించిందన్నారు. దిగువ స్థాయిలో మద్దతు లభించడంతో నిఫ్టి గతవారం 16000పైన ముగిసింది. అలాగే గతవారం వాల్‌స్ట్రీల్ ఆరంభంలో భారీగా నష్టపోయినా దిగువ స్థాయిలో మద్దతు అందిందని… వాల్‌స్ట్రీట్ సూచీలు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయని ఆయన అన్నారు. ఇవాళ ఆకర్షణీయ లాభాలతో నిఫ్టి ప్రారంభం అవుతున్నందు… నిఫ్టి పడే వరకు ఆగి కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. పొజిషన్స్ ఉన్నవారు 16070 స్టాప్‌లాస్‌తో పెట్టుకోవాలని… నిఫ్టి పెరిగినపుడల్లా స్టాప్‌లాస్‌ను ఆ మేరకు పెంచుకోవాలని ఆయన సూచించారు. సీఎన్‌బీఐ టీవీ18 ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ… ఈ వారం బ్రేకౌట్ ర్యాలీ వచ్చే అవకాశముందని సుదర్శన్ సుఖాని అభిప్రాయపడ్డారు. బ్యాంక్ నిఫ్టిని కూడా 35000 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని సూచించారు. ఇక షేర్ల విషయానికొస్తే…. బజాజ్ ఆటో షేర్‌ను రూ. 3860 స్టాప్‌లాస్‌తో కొనాలని సూచించారు. అలాగే హిందాల్కో షేర్‌ను రూ. 358 స్టాప్‌లాస్‌తో అమ్మాలని ఆయన సిఫారసు చేశారు. అలాగే హెచ్‌పీసీఎల్ షేర్‌ను రూ. 236 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయాలని అన్నారు. ఇక రిలయన్స్ షేర్‌ను కూడా కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. పొజిషనల్ ట్రేడర్స్ తమ పొజిషన్‌ను కొనసాగింవచ్చని… అయితే డే ట్రేడర్స్ మాత్రం రూ. 2385 స్టాప్‌లాస్‌తో ఈ కౌంటర్లో ఈ పొజిషన్స్‌ను కొనసాగింవచ్చని సుదర్శన్ సుఖాని అన్నారు.