For Money

Business News

ఇలాగైతే ప్రాజెక్టుల నిర్మాణం ఆపేస్తాం

నిర్మాణాలకు అవసరమైన ఇనుము, సిమెంట్‌, ఇసుక, ఇటుక ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం కష్టమని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌ (నారె డ్కో) స్పష్టం చేసింది. సంస్థ ప్రతినిధులు పీవీ మల్లికార్జునరావు, పీవీ కృష్ణ, బి.అమరనాథ్‌, వేమూరి సుబ్బారావు, యోగేశ్వరరావు తదితరులు మీడియాతో మాట్లాడారు. పెరిగిన ధరలతో అగ్రిమెంట్‌లో రాసుకున్న ధరలకు అనుగుణంగా నిర్మాణాలు పూర్తి చేయలేమని తేల్చిచెప్పారు. సిమెంట్‌ వ్యాపారులంతా సిండికేట్‌గా ఏర్పడి ధరలను పెంచేశారని ఆరోపించారు. ఇలాం టి పరిస్థితిని ఇంతకుముందెన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభు త్వం స్టాంపు డ్యూటీలకు సంబంధించి విడుదల చేసిన ఉత్తర్వుల కారణంగా నిర్మాణ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు.
నిర్మాణ రంగానికి మూడు మూలస్తాంభాలు అయిన ఇసుక, ఇనుము, సిమెంట్‌ ధరలు భారీగా పెరగడంతో ఆ రంగం తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోతోంది. గత ఏడాది కాలంలో ఇనుము ధర 25 శాతం, సిమెంట్‌ ధరలు 35 శాతం పెరిగిపోయాయి. టన్ను ఇనుము ధర 2021 జనవరిలో రూ.58 వేలు ఉండగా.. ఇప్పుడు రూ.74 వేలకు చేరిందని పరిశ్రమ వరగ్ఆలు అంటున్నాయి. సిమెంట్‌ బస్తా ధర అప్పట్లో రూ.320 ఉండగా.. ఇప్పుడు రూ.425 పలుకుతోంది. 2008లో టన్ను రూ.16-18 వేలు ఉన్న ఇనుము ఒక్కసారిగా రూ.38వేలకు పెరిగిందని కాంట్రాక్టర్లు అంటున్నారు.