For Money

Business News

సెబీ చీఫ్‌పై మరో ఆరోపణ

సెబీ ఛైర్‌పర్సన్‌ మాధవీ పురి బుచ్‌పై ఆరోపణలను కాంగ్రెస్‌ పార్టీ తీవ్రం చేసింది. సాధారణంగా ఒక ఆరోపణ చేసి.. దానిపై చర్యలకు డిమాండ్‌ చేయడం రాజకీయ పార్టీలకు ఆనవాయితీ. సెబీ విషయంలో మాత్రం కాంగ్రెస్‌ రోజుకో కొత్త ఆరోపణను ముందుకు తెస్తోంది. సొంత ఆఫీసులోనే తీవ్ర అసమ్మతి ఎదుర్కొంటున్న మాధవిని కాంగ్రెస్ తాజా ఆరోపణలు మరింత ఇరుకున పెట్టాయి. సెబీ దర్యాప్తు చేస్తున్న ఓ సంస్థకు మాధవి తన భవనాన్ని అద్దెకు ఇచ్చినట్లు పేర్కొంది. సెబీ సభ్యురాలిగా ఉన్న మాధవీ ముంబైలోని ఓ భవనాన్ని 2018-19లో క్యారల్‌ ఇన్‌ఫో సర్వీసెస్‌ అనే సంస్థ అద్దెకు ఇచ్చారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేరా ఆరోపించారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ సహా అనేక కేసుల్లో సెబీ దర్యాప్తు చేస్తున్న ఫార్మా కంపెనీ వొకార్డ్‌కు క్యారల్‌ ఇన్‌ఫో అనుబంధ సంస్థ అని ఖేరా తెలిపారు. ఆ రెండు కంపెనీల ప్రమోటర్లు కూడా ఒకరేని వెల్లడించారు. నెలకు రూ. 7 లక్షల అద్దె చొప్పన మాధవీ ఇచ్చారని పేర్కొన్నారు. 2018-19 నుంచి 2023-24 వరకు అద్దె రూపంలో మాధవీకి రూ.2.16 కోట్లు వచ్చాయని ఖేరా అరోపించారు. ఇది పూర్తిగా అవినీతి కిందకు వస్తుందని ఆయన అన్నారు.

Leave a Reply