ఇక అన్ని రకాల ఇన్సూరెన్స్‌లకు ఒకటే లైసెన్స్!
మొత్తానికి బీమా పరిశ్రమ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న ప్రతిపాదన కార్యరూపం దాల్చనుంది. అన్ని రకాల ఇన్సూరెన్స్ వ్యాపారం చేసేందుకు ఒక్క లైసెన్స్ చాలని కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనపై ప్రజలతో పాటు ఇతర స్టేక్ హోల్డర్స్ నుంచి సూచనలు, సలహాలను కోరింది. డిసెంబర్ 15వ తేదీ వరకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే పంపుకోవచ్చు. ఆ తరవాత ఈ విధానాన్ని అమలు చేస్తారు. ప్రస్తుతం లైఫ్, హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారాలు ఉన్నాయి. వీటికి భిన్న కంపెనీలు ఉన్నాయి. వాటికి విడిగా లైసెన్స్ తీసుకుంటున్నారు. ఇక నుంచి ఒకే లైసెన్స్ తీసుకుని ఈ మూడు విభాగాలకు చెందిన వ్యాపారం చేయొచ్చు. అంటే లైఫ్ పాలసీల వ్యాపారం చేస్తున్న ఎల్‌ఐసీ హెల్త్, జనరల్ ఇన్సూరెన్స్ వ్యాపారం కూడా చేయొచ్చు. అలాగే ఇతర కంపెనీలు కూడా. అలాగే మోటార్, హెల్త్, యాక్సిడెంట్ వంటి సబ్ క్లాస్ వ్యాపారం కూడా చేపట్టవచ్చు.