ఈ ఏడాది 50,000 నియామకాలు
కాగ్నిజంట్ కంపెనీ ఈ ఏడాదిలో 50,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకోనుంది. కంపెనీ చరిత్రలోనే ఒకే ఏడాదిలో ఈ స్థాయిలో నియామకాలు చేయడం ఇదే మొదటిసారి. 2021 లో కంపెనీ మనదేశంలో 33,000 మంది ఫ్రెషర్లను చేర్చుకుంది. కంపెనీ నుంచి వెళ్ళిపోతున్న ఉద్యోగుల సంఖ్య కూడా భారీగా ఉన్నందున అదే స్థాయిలో కంపెనీ ఫ్రెషర్స్‌ను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 2021 అక్టోబరు- డిసెంబరులో కంపెకనీ నుంచి బయటకు వెళ్ళిన సిబ్బంది 31 శాతం. డిసెంబరు ఆఖరుకు కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,30,600. అలాగే డిసెంబర్‌తో ముగిసిన ఏడాదికి 1,850 కోట్ల డాలర్ల ( సుమారు రూ .1.39 లక్షల కోట్ల ఆదాయాన్ని కాగ్నిజంట్ నమోదు చేసింది. 2022 తొలి త్రైమాసికంలో 10.2-11.2 % మేర ఆదాయం పెరుగుతుందని సంస్థ అంచనా వేస్తోంది.