పబ్లిక్ ఇష్యూకు కోజెంట్ ఈ-సర్వీసెస్
కోజెంట్ ఈ – సర్వీసెస్ లిమిటెడ్ త్వరలోనే క్యాపిటల్ మార్కెట్‌లోకి రానుంది. ఈ మేరకు సెబీకి ప్రాస్పెక్టస్ సమర్పించింది. మొత్తం రూ.150 కోట్లు విలువ చేసే తాజా షేర్లతో పాటు 994.68 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించాలని కంపెనీ ప్రతిపాదించింది. మరో రూ .30 కోట్లు ప్రైవేటు ప్లేస్‌మెంట్ ద్వారా సమీకరించాలని యోచిస్తోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను వ్యాపార విస్తరణలో భాగంగా ఐటీ ఆస్తుల్లో పెట్టుబడులు, ఇప్పటికే ఉన్న కంపెనీ ఐటీ మౌలిక వసతుల విస్తరణకు ఉపయోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే వర్కింగ్ క్యాపిటల్, కార్పొరేట్ అవసరాలకు కూడా కొన్ని నిధుల్ని కేటాయించనున్నట్లు తెలిపింది. వివిధ దశల్లో వాయిస్, నాన్ వాయిస్ మార్గాల ద్వారా కస్టమర్ల సమస్యలకు పరిష్కారాన్ని అందించే బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాల సేవలను అందిస్తోంది.