For Money

Business News

ప్రిస్టేజ్‌ ఎస్టేట్స్‌: కొనండి

ఏడాది నుంచి రియల్ ఎస్టేట్‌ కంపెనీలపై ఆసక్తి పెరిగింది. చాలా షేర్లు 50 శాతం నుంచి 60 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రంగంలోని షేర్లలో పెట్టుబడి పెట్టొచ్చా అన్న అనుమానం రావడం సహజం. ముఖ్యంగా నిర్మాణ వ్యయం భారీగా పెరిగిన నేపథ్యంలో కంపెనీల మార్జిన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రిస్టేట్‌ ఎస్టేట్‌ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని రీసెర్చి సంస్థ సీఎల్‌ఎస్‌ఏ రెకమెండ్‌ చేస్తోంది. ఈ రంగంలోని లోధా, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ షేర్లతో పోలిస్తే ఈ షేర్‌ చాలా తక్కువ డిస్కౌంట్‌తో ట్రేడవుతోంది. అంటే పెరిగేందుకు చాలా ఛాన్స్‌ ఉంది. కంపెనీ అమ్మకాలు రూ. 10,000 కోట్లపైనే ఉంటాయని సీఎన్‌ఎస్‌ఏ అంటోంది. ప్రిసేల్‌ యాక్టివిటీ విషయంలో కంపెనీ బాగా రాణిస్తోందని, రెంటల్‌ పోర్టుఫోలియో కూడా చాలా పటిష్ఠంగా ఉందని పేర్కొంది. కంపెనీ బ్యాలెన్స్‌ షీట్‌ కూడా సానుకూలంగా ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈ షేర్‌ రూ. 493 వద్ద ఉంది. ఇదే ధర వద్దా లేదా పడినా కొనగోలు చేయొచ్చు. ఎందుకంటే ఈ సంస్థ కంపెనీ షేర్‌కు ఇచ్చిన టార్గెట్‌ రూ. 595.