For Money

Business News

ఫోన్‌ నంబరూ కొనుక్కోవాల్సిందేనా?

త్వరలోనే మీరు ఫోన్‌ నవంబర్‌ కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) చేసిన కొత్త సిఫార్సులకు ప్రభుత్వం గనుక ఆమోదిస్తే… మీరు ఫోన్‌ నంబర్లను కూడా కొనాల్సి ఉంటుంది. మొబైల్‌ ఫోన్‌ నంబర్‌తో పాటు ల్యాండ్‌లైన్‌ నంబర్‌ను కొనుక్కోవాల్సి ఉంటుంది. ఒక్క నంబరుకు టెలికాం కంపెనీల నుంచి కొంత చార్జిని వసూలు చేయాలని ట్రాయ్‌ ప్రతిపాదించింది. ఆ మొత్తాన్ని ఎలాగూ కస్టమర్ల నుంచి కంపెనీలు వసూలు చేస్తాయి. ఒక్కో నంబర్‌కు ఒకసారి మాత్రమే ఈ చార్జి వసూలు చేయాలా..? లేదా నంబరింగ్‌ సిరీస్‌కు ఏటా కొంత మొత్తం వసూలు చేయాలా? అనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ట్రాయ్‌ వర్గాలు అంటున్నాయి. దేశంలో ఉన్న నంబర్లలో 20 దాకా నంబర్లు వినియోగం లేవని ట్రాయ్‌ అంటోంది. సుమారు 21.9 కోట్ల నంబర్లను ‘సర్వీసెస్‌ సస్పెండెడ్‌ పెండింగ్ డిస్‌కనెక్షన్‌’ పేరుతో టెలికాం కంపెనీలు ఉంచాయి. కనెక్షన్లను వెంటనే తొలగిస్తే తమ కస్టమర్ల సంఖ్య తగ్గిపోతుందని టెలికాం కంపెనీల భయం. దీంతో నంబర్లను సమర్థంగా వాడుకోవడానికి వీలుగా చార్జి వసూలు చేయాలని ట్రాయ్‌ సిఫారసు చేసింది. ఇపుడు మార్కెట్లో ఉన్న చాలా వరకు ఫోన్లు డ్యూయల్‌ సిమ్‌ కార్డు ఉన్నవే. వీటిలో కొందరు ఒక నంబర్‌నే వాడుతున్నారు. మరో నంబర్‌ వాడటం లేదు. అయితే వాడని నంబర్‌ను కంపెనీలు వెంటనే డిస్‌కనెక్ట్ చేయడం లేదు. దీంతో 20 శాతం నంబర్లు వినియోగం లేని పరిస్థితి ఉంది.

Leave a Reply