For Money

Business News

రాష్ట్రాలకు జీఎస్టీ బకాయి మొత్తం చెల్లింపు

గత ఆర్థిక సంవత్సరంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరం మే వరకు ఉన్న జీఎస్టీ బకాయిలను రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసింది. గతవారం జీఎస్టీ బకాయిలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వేదికపైనే ప్రధాన మంత్రి మోడీని నిలదీసిన విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి, మార్చి నెలకు బకాయి ఉన్న మొత్తం రూ. 21,322 కోట్లు, ఏప్రిల్‌, మేనెలలో బకాయి ఉన్న రూ. 17,973 కోట్లతో పాటు 2022 జవనరి వరకు పెండింగ్‌లో ఉన్న రూ. 47,617 కోట్లను.. ఏక మొత్తంలో రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసింది. అంటే ఇప్పటి వరుకు రాష్ట్రాలకు కేంద్రం రూ. 86,912 కోట్లు బకాయి ఉందన్నమాట.
వివిధ రాష్ట్రాలకు అందిన బకాయిలు (కోట్ల రూపాయాల్లో)
ఆంధ్రప్రదేశ్‌ – 3199
అస్సామ్‌ – 232
చండీఘడ్‌ – 1434
ఢిల్లీ – 8012
గోవా – 1291
గుజరాత్‌ – 3364
హర్యానా – 1325
హిమాచల్‌ ప్రదేశ్‌ – 838
ఝార్ఖండ్‌ – 1385
కర్ణాటక – 8633
కేరళ – 5693
మధ్యప్రదేశ్‌ – 3120
మహారాష్ట్ర – 14145
పుదుచ్చేరి – 576
పంజాబ్‌ – 5890
రాజస్థాన్‌ – 963
తమిళనాడు – 9602
తెలంగాణ – 296
ఉత్తర ప్రదేశ్‌ – 8874
ఉత్తరాఖండ్‌ – 1449
పశ్చిమ బెంగాల్‌ – 6591
మొత్తం – 86912