For Money

Business News

ప్రతినెలా రూ. 600 చెల్లించాల్సిందే

మీరు హైదరాబాద్‌లో ఉంటారా? మీకు యాక్సిస్‌ బ్యాంక్‌లో అకౌంట్‌ ఉందా? చాలా బ్యాంకుల్లో శాలరీ అకౌంట్‌కు చార్జీలు ఉండవు. అయితే ఇవాళ్టి నుంచి యాక్సిస్‌ బ్యాంకులో సాధారణ, శాలరీ అకౌంట్‌కు కూడా ప్రతినెలా కేవలం సర్వీస్‌ చార్జీ కింద రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. పట్టణాల్లో ఉన్నవారు రూ. 300 చెల్లించాలి. గ్రామీణ ప్రాంతంలో ఉన్న శాఖల కస్టమర్లు కూడా రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. ఈ చార్జీలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయి. ఇది గాక.. మీ బ్యాంకులో కనీసం రూ. 25,000. లేని పక్షంలో ఎంత మొత్తం ఉందో చూస్తారు. రూ. 25000 ఉంటే సరి. లేకుంటే ఎంత తక్కువ ఉంటే ఆ మొత్తంపై 7.5 శాతం వడ్డీ వసూలు చేస్తారు. ఇవి రెండు ప్రతినెలా ఒకటవ తేదీ కస్టమర్ల ఖాతా నుంచి ఆటోమేటిగ్గా కట్‌ అవుతాయి. వివిధ రకాల ఖాతాలను బ్యాంక్‌ ప్రవేశ పెట్టి, ప్రీమియం ఖాతాలకు కొన్ని వెసులుబాట్లు కల్పించింది.