For Money

Business News

ఎస్‌బీఐ హౌసింగ్‌లోన్‌ EMI పెరిగింది

ప్రభుత్వ రంగంలోని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) హౌసింగ్‌ లోన్లపై వసూలు చేసే వడ్డీ రేటు మరింత పెంచింది. ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ లెండింగ్‌ రేటు (EBLR)ను 0.4 శాతం పెంచింది. దీంతో EBLRఆధారిత ఎస్‌బీఐ గృహ రుణాల వడ్డీ రేటు 6.65 శాతం నుంచి 7.05 శాతానికి, రెపో ఆధా రిత గృహ రణాల వడ్డీ రేటు (RLLR) 6.25 శాతం నుంచి 6.65 శాతానికి చేరనుంది. క్రెడిట్‌ రిస్క్‌ ప్రీమియం (సీఆర్‌పీ) దీనికి అదనం.బుధవారం నుంచే ఈ పెంపు అమల్లోకి వస్తుందని ఎస్‌బీఐ తెలిపింది.